ఆ చలిలో జిప్పీ లేకపోతే...

30 Jun, 2015 18:04 IST|Sakshi
ఆ చలిలో జిప్పీ లేకపోతే...

సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమవుతున్న టీనా ఆహూజా తన తొలి సినిమా షూటింగ్లో మాంచి బిజీగా ఉంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. సినిమా హీరో జిప్పీ గ్రేవాల్ తనకు బాగా సహకరిస్తున్నాడని, అతడు లేకపోతే యాక్టింగ్ వదిలేసి ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయేదాన్నని చెప్పుకొస్తోంది.

బాగా చలిగా ఉన్న ప్రదేశంలో ఒక రొమాంటిక్ సీన్లో నటించాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. ఇక నా వల్లకాదు.. పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో జిప్పీ తన కోటు ఇచ్చి రక్షించాడని తెలిపింది. గడ్డ కట్టుకుపోయే చలిలో రొమాంటిక్  సీన్లను పండించడం అంత ఈజీ కాదంటోంది. ఆ చలికి వణికిపోతూ ఇబ్బంది పడుతోంటే జిప్పీ ఇచ్చిన జాకెట్ తనను కాపాడిందంటోంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా.. ఇదంతా నటనలో భాగమని అర్థమయ్యాక పెద్ద కష్టమనిపించలేదని పేర్కొంది. ఎలాగైతేనే చివరికి ఆ సీన్ పూర్తి చేశాం... ఇట్ వజ్ ఫన్ అంటూ ముగించింది. కాగా స్మీప్ కాంగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కూడా ప్రముఖ  పాత్ర పోషిస్తున్నారు.  కాగా, హీరోయిన్ టీనా అహూజా కూడా.. మరో ప్రముఖ హీరో గోవిందా కూతురు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి