తమన్న సౌందర్య రహస్యం ఇదే!

19 Dec, 2015 02:27 IST|Sakshi
తమన్న సౌందర్య రహస్యం ఇదే!

అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారో కవి. అంతటి మధురానందం ఉన్న అందం కోసం అందరూ ఆశ పడతారు.మగువలు మరీనూ. అయితే అందాన్ని కాపాడుకోవడం ఎలా? అన్నది చాలా మందిలో కలిగే ప్రశ్న. అలాంటి వారికి మిల్కీ బ్యూటీ తమన్న సౌందర్య రహస్యం సమాధానం కావచ్చు. అందానికి అందం తమన్న. నవ నవలాడే ఆమె మేను అందాల సీక్రెట్ తమన్న మాటల్లోనే చూద్దాం. నా దినచర్య చాలా నిబద్ధతతో కూడి ఉంటుంది.

ఆహార నియమాలు పాటిస్తాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ శాండ్‌విచ్,ఆమ్లేట్‌ను తీసుకుంటాను. మధ్యాహ్నం ఒక్క చపాతి, రైస్,చికెన్ ఫ్రై తింటాను. నేను ముంబైలో పుట్టి పెరిగినా చపాతీ అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే మధ్యాహ్నం వరి అన్నమే తింటాను. మధ్యలో గంటకోసారి కాయగూరల సూప్ తీసుకుంటాను. ఇక ఆయిల్ ఫుడ్‌ను తక్కువ మోతాదులో తింటుంటాను. రోజుకు మూడు పూటలా ఫుల్‌గా భోజనం లాగించేయకుండా కొంచెం కొంచెం ఆరు సార్లు తింటాను.

ఇక సౌందర్య టిప్స్ గురించి చెప్పాలంటే షూటింగ్ సమయంలో లైట్స్ ముందు, ఎండల్లో నిలబడటం వల్ల ముఖం నల్లబడుతుంది. అందువల్ల రోజూ శెనగపిండిలో పెరుగు కలిపి ఆ గుజ్జును ముఖానికి పట్టించి కొంత సేపు తరువాత చల్లని నీళ్లతో కడిగితే ముఖచాయ పెరుగుతుంది.
 
రాత్రి వేళల్లో పడుకునే ముందు తలకు కొబ్బరి నూనె పట్టించి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ జరిగి జుత్తు రాలకుండా ఉంటుంది.చల్లని నీళ్లతో స్నానం చేయడం మంచిది. అన్నిటికంటే ప్రశాంతమైన నిద్ర చాలా మేలు చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మంచి కవితలు చదువుతాను. టెన్షన్‌గా ఉంటే మంచి సినిమా పాటలు వింటాను.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను.మంచినీళ్లు, పళ్ల రసాలు అధికంగా తీసుకుంటాను. షూటింగ్ లేకుంటే ముఖానికి మేకప్ వేసుకోను.
 
అదే విధంగా షూటింగ్‌ను రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా మేకప్ కడిగే పడుకుంటాను.చదువుకునే రోజుల్లో ఎక్కువగా చుడీదారులే ధరించేదాన్ని. నటిని అయిన తరువాత రకరకాల నా దుస్తులను చూసి స్నేహితురాలు ఆశ్చర్యపోతుంటారు. బయట కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చీరలు ధరించడానికే ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే నా ఫేవరేట్ డ్రస్ టీషర్టు, జీన్స్ పాంటు. శారీరక కసరత్తులు చాలా అవసరం. నేను నిత్యం ఎక్సర్‌సైజులు చేస్తాను. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చివరిగా యోగా చేస్తాను. ఇవీ నేను పాటించే బ్యూటీ టిప్స్.