మరో 12,881 మందికి పాజిటివ్‌

19 Jun, 2020 06:34 IST|Sakshi

దేశంలో మొత్తం కోవిడ్‌ కేసులు 3,66,946

న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే అత్యధికంగా 12,881 కోవిడ్‌–19 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరుకుంది. అదేవిధంగా, వైరస్‌ బారినపడి మరో 334 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు 12,237 మంది చనిపోయినట్లయింది. గడిచిన రెండు రోజుల్లో కోవిడ్‌ బాధితుల్లో మరణాల రేటు 2.8 శాతం నుంచి 3.3 శాతానికి ఎగబాకింది. గురువారం నాటికి దేశంలో 1,60,384 యాక్టివ్‌ కేసులుండగా, కోలుకున్నవారి సంఖ్య 1,94,325కు చేరుకుంది. మొత్తమ్మీద 52.95 శాతం మంది కోలుకున్నారని ఓ అధికారి తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 18 వరకు నిర్ధారణ అయిన 1,76,411 కరోనా కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. 24 గంటల్లో కోవిడ్‌తో చనిపోయిన 334 మందిలో అత్యధికంగా మహారాష్ట్ర(114), ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(67) ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 1,16,752 కేసులు నమోదయ్యాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మృతుల్లో భారత్‌ 8వ స్థానంలో ఉంది.

>
మరిన్ని వార్తలు