కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా బంకెట్ హాళ్లు

25 Jun, 2020 20:45 IST|Sakshi

100 ప‌డ‌క‌ల‌ సామ‌ర్థ్యం

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆసుప‌త్రులు క‌రోనా రోగుల‌తో కిక్కిరిసిపోయాయి. దీంతో కొత్త రోగుల‌కు ఆసుప‌త్రులో బెడ్లు దొర‌క‌డం గ‌గ‌నంగా మారింది. ఈ క్ర‌మంలో తొలిసారిగా ఢిల్లీలోని ద‌ర్య‌గంజ్‌లో షెహ‌నాయ్ బంకెట్ హాల్ కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద క‌రోనా ఆసుప‌త్రి అయిన‌ లోక్ నాయ‌క్ జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ హాస్పిట‌ల్‌(ఎల్ఎన్‌జెపి)కు అనుసంధాన‌మై ఉంటుంది. 100 ప‌డ‌క‌ల‌ సామ‌ర్థ్యం క‌లిగిన‌ ఈ బంకెట్ హాల్‌లో 50 మంది హెల్త్ కేర్ సిబ్బంది ప‌ని చేస్తారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాతో క‌లిసి బుధ‌వారం ఈ కోవిడ్‌ కేర్ సెంట‌ర్‌ను ప్రారంభించారు. (ఒక్క రోజులో 11వేల మంది డిశ్చార్జి)

దీని గురించి 'డాక్ట‌ర్స్ ఫ‌ర్ యు' ఎన్జీవో వ్య‌వ‌స్థాప‌కుడు డా.ర‌వికాంత్ సింగ్ మాట్లాడుతూ.. "ఇక్క‌డ అన్ని సేవ‌లు ఉచితమే. పేషెంట్ల ఖ‌ర్చు మేమే భ‌రిస్తాం. ఇక్క‌డ‌ ప‌న్నెండు మంది డాక్ట‌ర్లు, 24 మంది న‌ర్సులు, 20 మంది వార్డ్ బాయ్‌లు ఉంటారు. అత్య‌వ‌స‌ర వేళల్లో ఉప‌యోగించేందుకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి" అని తెలిపారు. కాగా మ‌రో 80 బంకెట్ హాళ్ల‌ను సైతం కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా మార్చేందుకు ఆప్ ప్ర‌భుత్వం యోచిస్తోంది. త‌ద్వారా అద‌నంగా 11వేల బెడ్లు అందుబాటులోకి వ‌స్తాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు)

మరిన్ని వార్తలు