500 గుడిసెలు కూల్చేశారు

13 Dec, 2015 11:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్రమణకు గురైన తమ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రైల్వే అధికారులు దృష్టిని సారించారు. ఆదివారం ఉదయం పశ్చిమ ఢిల్లీలో రైల్వే పట్టాలకు సమీపంలో ఆక్రమణకు గురైన తమ స్థలాన్ని రైల్వే పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకునే కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 500 గుడిసెలను నేలమట్టం చేశారు.

దీంతో బాధితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఈ గుడిసెలు తొలగించే క్రమంలో ఓ చిన్నారి కూడా మృతిచెందినట్లు తెలిసింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు గుడిసెల్లో నివసించే బడుగుల మధ్య వాగ్వాదం నెలకొని గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే, చట్ట ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, నిబంధనలు పాటిస్తూనే తమ స్తలాలు స్వాధీనం చేసుకుంటున్నామని అధికారుల చెప్పారు.

>
మరిన్ని వార్తలు