కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీగా తెలుగు తేజం

19 Aug, 2016 02:41 IST|Sakshi
కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీగా తెలుగు తేజం

న్యూఢిల్లీ: భారత సముద్ర తీర రక్షణ దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్‌ఆర్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం తాలూకా ఉంగుటూరులో జన్మించారు. మూర్తి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ విద్యాభ్యాసం చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1984లో కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. 32 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2009లో ఫ్లాగ్ ర్యాంక్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందిన మూర్తి.. కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (ఆపరేషన్స్, సముద్ర తీర భద్రత)గా పనిచేశారు.

2012లో అండమాన్, నికోబార్ రీజియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా, 2014లో నార్త్ ఈస్ట్ రీజియన్ కమాండెంట్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ‘బెస్ట్ షిప్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి కోస్ట్ గార్డ్ పతకం (విశిష్ట సేవ), 2003లో కోస్ట్ గార్డ్ పతకం (శౌర్యం) అందుకున్నారు.

మరిన్ని వార్తలు