అమరావతికి ఎయిర్ అంబులెన్స్ సేవలు

30 Jun, 2016 02:30 IST|Sakshi

కేంద్రానికి మంత్రి కామినేని వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ అంబులెన్స్ సేవలను రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి పరిధిలో అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుతో సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రైల్వేశాఖ కృష్ణా పుష్కరాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలసి విన్నవించారు.

వివిధ రాష్ట్రాల నుంచి కృష్ణా పుష్కరాలకొచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్ని గుర్తుచేశారు. ధర్మవరంలో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభానికి రావాలంటూ సురేశ్‌ప్రభును ఆహ్వానించారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీనుంచి రాజ్యసభకు ఎన్నికైనందున ఎంపీలాడ్స్ నిధులనుంచి 13 జిల్లాలకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తానని రైల్వేమంత్రి హామీ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని వార్తలు