జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్‌లో కేజ్రీవాల్‌

9 Jun, 2020 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురవ్వడంతో ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన ఇవాళ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోనున్నారు. అస్వస్థతకు గురవ్వడంతో ఆయన తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకొన్నారు. మంగళవారం నిర్వహించే టెస్టుల్లో ఆయనకు వైరస్ సోకిందా లేదా అనేది తేలనుంది. ఢిల్లీలో ఏకంగా ముఖ్యమంత్రే వైరస్ బారిన పడ్డారనే వార్తలు అధికారులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజే కొత్తగా వెయ్యి కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 30వేలకు చేరుకుంది. 874 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 9,987 కేసులు నమోదు కాగా, మహమ్మారి బారిన పడి 331 మంది చనిపోయారు. దీంతో మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,66,598కు చేరింది. కాగా.. మృతుల సంఖ్య 7,466కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1,29,215 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,29,917 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 88,529 కరోనా కేసులు నమోదవ్వగా.. 3,169 మంది చనిపోయారు. (కేజ్రీవాల్‌ వింత నిర్ణయం)

మరిన్ని వార్తలు