ఈరోజు రాజధానిలో ఏం జరగబోతోంది?

6 May, 2016 10:15 IST|Sakshi
ఈరోజు రాజధానిలో ఏం జరగబోతోంది?

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన కీలక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్నిఎత్తి చూపుతూ కాంగ్రెస్ పక్షం, విపక్ష ఆరోపణలకు తిప్పికొడుతూ అధికార పక్షం ఒకే రోజు, ఒకే చోట నిరసనలకు దిగడంతో ఈ రోజు ఢిల్లీలో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ, ఆరోపితులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  అధికార బీజేపీ ఎంపీలు శుక్రవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సరిగ్గా అదే ప్రదేశానికి (గాంధీ విగ్రహం వద్దకు) కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ రానుంది.

ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు 'సేవ్ డెమోక్రసీ' పేరుతో ర్యాలీని చేపట్టింది. చీఫ్ సోనియా గాంధీ, వీపీ రాహుల్ గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సహా ముఖ్యనాయకులంతా ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయిస్తారు. ఇరు పక్షాలు గాంధీ విగ్రహం వద్ద ఎదురుపడే అవకాశం ఉండటంతో ఎవరో ఒకరు పక్కకు తప్పుకుంటేతప్ప ఉద్రిక్తత తప్పే అవకాశం లేదు. మరోవైపు ఇవే అంశాలపై వైరిపక్షాన్ని సభలోనూ నిలదీయాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు