మీడియా మిత్రులకు కేజ్రీవాల్‌ ‘గుడ్‌న్యూస్‌’

29 Apr, 2020 11:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విస్తరిస్తున్న వేళ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవాల్‌ బుధవారం ఓ సానుకూల విషయం చెప్పారు. 529 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్‌లో తెలిపారు. వారంతా త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాక్షించారు. మీడియా ప్రతినిధుల పని ప్రాధాన్యం కలిగినదని, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు చాలా అవసరమని కొనియాడారు. కాగా, కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇక మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ప్రింట్‌, ఎలాక్ట్రానిక్‌ మీడియాలో పనిచేసే మీడియా ప్రతినిధులకు కోవిడ్‌ పరీక్షలు చేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే.

(చదవండి: కేంద్రం నిర్ణయం సరైనది కాదు : కేజ్రీవాల్‌)

మరిన్ని వార్తలు