అంబులెన్స్ నిరాక‌ర‌ణ‌: రోడ్డుపై క‌రోనా పేషెంట్‌

22 May, 2020 20:18 IST|Sakshi

ముంబై: అస్వ‌స్థ‌త‌గా ఉందంటూ అంబులెన్స్ కోసం ఆస్ప‌త్రికి కాల్ చేసిన క‌రోనా బాధితుడికి నిరాశే ఎదురైంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లి ఆస్ప‌త్రికి చేరుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని డాంబివిలిలో చోటు చేసుకుంది. క‌రోనా బాధితుడు త‌న‌కు అస్వ‌స్థ‌త‌గా ఉందంటూ అంబులెన్స్ పంపించాలంటూ ఆసుప‌త్రికి ఫోన్ చేశాడు. ప్ర‌స్తుతం అంబులెన్స్ అందుబాటులో లేద‌ని, కావాలంటే అత‌డినే ఏదో ఒక మార్గాన్ని చూసుకుని వ‌చ్చేయ‌మ‌ని అటువైపు నుంచి నిర్ల‌క్ష్యంగా స‌మాధాన‌మిచ్చింది. ప‌లుమార్లు ఫోన్ చేసి సాయం కోసం అర్థించిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. (షాకింగ్‌ : కరోనాకు ముందు - ఆ తర్వాత!)

దీంతో దిక్కు తోచ‌ని స్థితిలో అత‌డు రోడ్డుపై స్థానికుల స‌హాయంతో 2 కి.మీ న‌డుచుకుంటూ హాస్పిట‌ల్‌కు చేరుకున్నాడు. తీరా అక్క‌డికి వెళ్లాక కూడా ఆస్ప‌త్రి వ‌ర్గాలు అత‌డిని బ‌య‌టే మూడు గంట‌లపాటు ఎదురు చూసేలా చేశాయి. దీనిపై అత‌ని తోడుగా వచ్చిన వ్య‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా రోగిని న‌డుచుకుంటూ వ‌చ్చేలా చేయ‌డ‌మే కాక‌, గంట‌ల కొద్దీ వెయిటింగ్ చేయించ‌డ‌మేంట‌ని అస‌హ‌నానికి లోన‌య్యారు. కాగా మ‌హారాష్ట్ర‌లో గురువారం ఒక్క‌రోజే 2345 కొత్త‌ కేసులు వెలుగు చూడ‌గా మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 41,642కు చేరుకుంది. (కొత్త జంట‌కు షాక్‌: వ‌ధువుకు క‌రోనా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు