డాక్టర్‌ను బలితీసుకున్న కరోనా

20 Apr, 2020 18:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మొరదాబాద్‌(యూపీ): కరోనా పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులను కూడా మహమ్మారి బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఓ వైద్యుడు కరోనా కాటుకు బలైయ్యారు. కోవిడ్‌-19 సోకిన వైద్యుడొకరు.. తీర్థంకర్‌ మహవీర్‌ యూరివర్సిటీ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్టు మొరదాబాద్‌ ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ఎంసీ గార్గ్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కారణంగా వైద్యుడు మృతి చెందడం ఇదే మొదటిసారి. మొరదాబాద్‌ నుంచి తబ్లిగీ జమాత్‌ సమ్మేళనానికి హాజరైన వారిని గుర్తించడానికి నిర్వహించిన సర్వేలో సదరు డాక్టర్‌ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్‌ 10న ఆయనకు కోవిడ్‌ సోకినట్టు గుర్తించారు. పరిస్ధితి విషమంగా మారడంతో తర్వాతి రోజు ఆయనను ఐసీయూకు తరలించారు. గత ఐదు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అ‍త్యంత విషమంగా ఉందని, చికిత్స కూడా ఆయన స్పందించలేదని వైద్యులు తెలిపారు. 

కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్‌-19 సోకినప్పటికీ 129 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 17,656 కాగా, మృతుల సంఖ్య 559గా తేలింది. 2,842 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్యారోగ్య తాజాగా వెల్లడించింది.  

మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా.. అంత్యక్రియలకు వెళ్లను

మరిన్ని వార్తలు