ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి

27 Oct, 2019 03:08 IST|Sakshi

దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్‌ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్‌ దీపాలను వెలిగించడం వల్ల కూడా కాలుష్యానికి చెక్‌ పెట్టొచ్చు. ఇందులోభాగంగానే ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అవి కూడా ప్రభుత్వం తయారు చేసిన వాటిని మాత్రమే కొనాలి. ప్రభుత్వం తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. సో ఈ రెండింటితోనే ఈసారి ఢిల్లీ వాసులు దీపావళి జరుపుకొని సంతృప్తి పడవలసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా