పౌర ప్రకపంనలు : డ్రోన్‌లతో నిఘా

18 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని​ (సీఏఏ) వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో హింసాత్మక నిరసనలపై హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పౌర ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని సీలంపూర్‌, జఫ్రాబాద్‌, గోండా, నంద్‌నగరి ప్రాంతాల్లో మళ్లీ నిరసనలు తలెత్తవచ్చనే అంచనాతో హింస చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించింది. నిరసనకారలను నిశితంగా గమనించి తదునుగుణంగా చర్యలు తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులకు సూచించింది. నిరసనలను రికార్డు చేసేందుకు డ్రోన్లు, కెమెరాలను ఉపయోగించి హింసకు పాల్పడిన ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అవసరమైతే నిరసనకారుల ముసుగులో హింసకు పాల్పడే దుండగులను ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నేరచరిత కలిగిన వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు సైతం పరిశీలిస్తున్నాయి. దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, ఐబీ చీఫ్‌లతో భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు