ఐఐటీఎఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌

14 Nov, 2023 15:49 IST|Sakshi

ఢిల్లీ: పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌)లో ఏపీ పెవిలియన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, తయారయ్యే వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.పెవిలియన్‌లో  వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , జగనన్న కాలనీల నమూనాల ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడించారు.

ఏపీలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 45వేల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున  ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు. ఏపీలో పరిశ్రమల గ్రోత్ రేటు 11.43తో అందరి కంటే ముందుందని వెల్లడించారు. ఎగుమతులలో ఏపీ ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: దయాకర్‌ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌


 

మరిన్ని వార్తలు