దీపావళి కానుక

11 Oct, 2014 06:27 IST|Sakshi
దీపావళి కానుక

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 18 లక్షల మందికి వర్తించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఓ పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు.
 
* ఉద్యోగులకు ఏడు శాతం డీఏ పెంపు
* 18 లక్షల మందికి వర్తింపు
* సీఎం పన్నీరు సెల్వం ఆదేశం
వారిలో బయలుదేరింది. అలాగే రాష్ట్రంలో నెలకొ న్న పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కటకటాల్లోకి వెళ్లడం, ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో డీఏ పెంపు నిర్ణయం ఇప్పట్లో అమలయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ క్రమంలో శుక్రవారం సచివాలయంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహ న్ వర్గీస్ సుంకత్, సలహాదారు షీలా బాలకృష్ణన్‌తో సీఎం పన్నీరు సెల్వం సమావేశమయ్యారు. డీఏ పెంపుపై చర్చించారు. అమ్మ(జయలలిత) అడుగు జాడల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పన్నీరు సెల్వం ప్రకటించారు.

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పథకాల్ని సక్రమంగా అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రశంసించారు. ప్రభుత్వం, ప్రజల కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు, కుటుంబం పెన్షన్‌దారులు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్థానిక సంస్థలు, అంగన్‌వాడీ, గ్రామ అసిస్టెంట్లు, పౌష్టికాహార పథకం తదితర విధుల్లో ఉన్న 18 లక్షల మంది ఉద్యోగులకు ఈ డీఏ పెంపు వర్తిస్తుందని వివరించారు.

ఈ ఏడాది జూలై నుంచి పెంపు వర్తింప చేస్తున్నామని ప్రకటించారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం మీద 1558.97 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు డీఏ పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారుు. పండుగ కానుకగా ఈ పెంపును ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు