‘నా పేరు రిచా.. క్షేమం ఉన్నా’

27 Apr, 2020 15:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ రెండు ఫొటోల్లో కన్పిస్తున్న వైద్యురాలి పేరు మనీషా పాటిల్‌ అని, మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల ఈ యువ డాక్టర్‌ కోవిడ్‌ రోగులకు సేవలు అందిస్తూ కరోనా బారిన పడి మరణించినట్టు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎంతో మందిని కరోనా మహమ్మారి‌ బారి నుంచి కాపాడిన ఆమె తనను తాను రక్షించుకోలేకపోయిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటో ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో వైరల్‌గా మారింది. పూనమ్‌ వర్మ అనే ఫేస్‌బుక్‌ పేజీ నుంచి పోస్టయిన ఈ ఫొటోకు ఇప్పటివరకు 29 వేలకు పైగా లైకులు,  5 వేలకు కామెంట్లు రాగా, 1100 మందిపైగా షేర్‌ చేశారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు)

అయితే సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇండియా టుడే నకిలీ వార్తల వ్యతిరేక విభాగం(ఎఫ్‌డబ్ల్యూఏ) తేల్చింది. ఈ ఫొటోలోని యువతి పేరు రిచా రాజ్‌ఫుత్‌. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఆమె హోమియోపతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తాను చనిపోలేదని, తన ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఎఫ్‌డబ్ల్యూఏతో చెప్పారు. అసలు తాను కరోనా రోగులకు చికిత్స చేయడం లేదని వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో పెట్టిన రెండు ఫొటోలు తనవేనని, ఇవి పాతవని.. కరోనా సంక్షోభం సమయంలో తీసినవి కాదని డాక్టర్‌ రిచా రాజ్‌ఫుత్‌ స్పష్టం చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి సోషల్‌ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా వైరస్‌.. మరో దుర్వార్త

మరిన్ని వార్తలు