శశికళపై కేసు

10 Aug, 2016 12:07 IST|Sakshi
శశికళపై కేసు

తూత్తుకుడి: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారి ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శశికళ భర్త టి. లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ఎల్. ప్రదీప్ రాజా.. తనతో పాటు తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తెలిపింది.

తిరునల్వేలి జిల్లాలోని అనైకుడి ప్రాంతానికి చెందిన బాధితురాళ్లు చెన్నైలోని శశికళ నివాసం నుంచి 2015లో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమపై కోపం పెంచుకుని తమను వేధించేవారని ఫిర్యాదులో బాధితురాళ్లు పేర్కొన్నారు. శశికళ, ఆమె భర్త, ఆమె తల్లి తమను పలుమార్లు కొట్టారని వెల్లడించారు.

తెల్లకాగితాలపై తమతో సంతకాలు పెట్టించుకున్నారని, దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను అన్నాడీఎంకే పార్టీ పదవుల నుంచి అధినేత్రి జయలలిత సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు