సూర్య‌గ్ర‌హ‌ణం నాడు ప‌లు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

29 Jun, 2020 15:21 IST|Sakshi

ఛండీగ‌డ్ :  క‌రోనా..సామాన్య ప్రజానీకం నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా తాజాగా హ‌ర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు కూడా క‌రోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేస‌ర్ నియోజ‌వ‌ర్గ శాస‌న స‌భ్యుడు సుభాష్ సుధా గ‌త కొన్ని రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్ల‌డించారు. దీంతో సుభాష్ సుధా కుటుంబ‌స‌భ్యులను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. కాగా జూన్ 21న  సూర్య‌గ్ర‌హ‌ణం నాడు  బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్వ‌హించిన మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్గొన్న‌ట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కార్య‌క్ర‌మంలో సాధువులు, జర్నలిస్టులు,  రాజకీయ నాయకులతో సహా దాదాపు  200 మంది సమావేశమయ్యారని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వీరంద‌రినీ ట్రేస్ చేసే ప‌నిలో యంత్రాంగం సంసిద్ద‌మైంది. వీరెవ‌రిని క‌లిశారో అన్న దానిపై కూడా వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని అధికారులు పేర్కొన్నారు. (మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు )

కురుక్షేత్ర జిల్లాలోనే ఇప్ప‌టివ‌ర‌కు 115 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా రాష్ర్ట వ్యాప్తంగా 13,829 కేసులు న‌మోద‌యిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 402 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయ‌ని హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. హ‌ర్యానా రాష్ర్ట వ్యాప్తంగా రిక‌వ‌రీ రేటు  64.48% ఉండ‌గా ప్ర‌స్తుతం 4,689 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలిపింది. 
(ఉగ్రవాదరహిత జిల్లాగా అవతరించిన దోడా )


 

మరిన్ని వార్తలు