లాక్‌డౌన్‌ పాస్‌ అడిగినందుకు హోంగార్డుతో గుంజీలు..

21 Apr, 2020 14:53 IST|Sakshi

దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ అనవసరంగా రోడ్డుపైకి వస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. తిట్టి, కొట్టి ఆఖరికి బుజ్జగించి మరీ ఇంటి నుంచి బయటికి రావొద్దని వాహనదారులకు సూచిస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల ఆదేశాలను లెక్కచేయని కొంత మంది పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చిన ఓ అధికారిని లాక్‌డౌన్‌ పాస్‌ చూపించండి అని అడిగినందుకు పోలీసు అధికారితో గుంజీలు తీయించారు. ఈ అమానుష ఘటన బిహర్‌లో అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. పాట్నాకు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీ కోసం పోలీసులు ఓ అధికారి కారును ఆపారు. కార్లోని వ్యక్తి తాను వ్యవసాయశాఖ అధికారిని అని చెప్పగా.. లాక్‌డౌన్‌ పాస్‌ చూపించాలని విధి నిర్వాహణలో ఉన్న హోంగార్డు కోరాడు. దీంతో ఆగ్రహించిన అధికారి.. కారి దిగి హోంగార్డుతో వాగ్వాదానికి దిగారు. అధికారిని పాస్‌ అడిగినందుకు శిక్షగా చేతులు కట్టుకొని హోంగార్డుతో గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశారు.
(కిస్సింగ్‌ పోటీ.. మండిపడుతున్న నెటిజన్లు )

‘లాక్‌డౌన్‌ పాస్‌ అడిగినందుకు వ్యవసాయ అధికారి ఒక హోమ్ గార్డ్ జవాన్‌ను శిక్షిస్తున్నాడు.’ అని ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ‘కారు ఎలా ఆపారు.. అతను ఒక వ్యవసాయశాఖ  అధికారి’ అంటూ సీనియర్‌ పోలీసు ఒకరు హోంగార్డుపైకి అరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో అధికారుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ పోలీస్‌పై ఇలా అవమానకరంగా ప్రవర్తించినందుకు సదురు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 18 వేలు దాటగా.. ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 590 మంది మరణించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా మే 3 వరకు లాక్‌డౌన్‌ అమలవుతోంది. (వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్‌ఓ )

మరిన్ని వార్తలు