కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు

21 Apr, 2020 14:47 IST|Sakshi

ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను ఆదుకునేందుకు నిర్ణయం

భువనేశ్వర్‌ : కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
(చదవండి: మాస్క్‌ ధరించకుంటే రూ. 200 జరిమానా)

అదేవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అమరలవీరులుగా గౌరవిస్తామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అవార్డులు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యసిబ్బంది సేవలపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, వారి పట్ల అనుచితం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 24 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు.
(చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు)

>
మరిన్ని వార్తలు