పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు

16 Aug, 2015 15:29 IST|Sakshi
పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు

శ్రీనగర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్ కు ఆదివారం భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది.

శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది...  ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...తీవ్రగాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది.

మరిన్ని వార్తలు