జాబిల్లిపై చంద్రయాన్‌–2 ఇలా.. 

21 Jun, 2019 05:14 IST|Sakshi
చంద్రుడికి 30 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ల్యాండింగ్‌ నిర్వహిస్తున్న అంతరిక్ష మిషన్‌ , పరిశోధనలు చేసేందుకు చంద్రుడి ఉపరితలంపై దిగిన మొట్టమొదటి భారతీయ మిషన్‌

చిత్రాలను విడుదలజేసిన ఇస్రో

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూలై 15వ తేదీన చంద్రయాన్‌– 2 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్‌ అనుసం«ధానం పనులు పూర్తి చేసుకుంది. 

ఈ నేపథ్యంలో చంద్రయాన్‌– 2 చంద్రుడి మీద ఏ విధంగా దిగుతుందనే దానిపై ఇస్రో నాలుగు ఛాయా చిత్రాలను గురువారం విడుదల చేసింది. చంద్రుడిపై ఆర్బిటర్‌ ద్వారా మోసుకెళ్లిన ల్యాండర్, రోవర్‌లు చంద్రునికి 30 కిలో మీటర్ల ఎత్తులో నుంచి దిగుతున్న నాలుగు దశల ఊహా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.   

మరిన్ని వార్తలు