రోడ్లపైకి భారీగా జనం.. గుంజీలు తీయించిన పోలీసులు

21 Apr, 2020 11:59 IST|Sakshi

పుణే : కరోనా వైరస్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఇళ్లల్లో ఉంటేనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. దీంతో వందమందికిపైగా లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిని పోలీసులు సింఘాడ్‌ రోడ్డులో గుంజీలు తీయించారు. నిబంధనలు అతిక్రమించిన వారిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు.(పుణేలో 25 మంది వైద్య సిబ్బందికి కరోనా)

కాగా మహారాష్ట్రా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 10 గంటల వరకు 4676 కరోనా కేసులు నమోదవ్వగా, 232 మంది మృతిచెందారు. ఇక పుణేలో 87 కొత్త కరోనా కేసులతో కలుపుకుని మొత్తం 756 మంది కరోనా బారిన పడ్డారు. 

మరిన్ని వార్తలు