‘పీఎం కేర్స్‌’కు విరాళాలివ్వండి

29 Mar, 2020 04:36 IST|Sakshi

ప్రధాన మంత్రి కార్యాలయం విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్‌ ఫండ్‌)కు ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఏదైనా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం, బాధితులకు ఉపశమనం అందించడం లాంటి ప్రాథమిక లక్ష్యంతో కూడిన జాతీయ నిధిని ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్‌) ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ కు ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ ఫండ్‌ చిన్న చిన్న విరాళాలను కూడా అనుమతిస్తుంది. ఈ ఫండ్‌ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలంతా చిన్న విరాళాన్ని అయినా అందించవచ్చు. పౌరులు లేదా సంస్థలు పీఎం ఇండియా డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పై వివరాలను ఉపయోగించి పి.ఎం. కేర్స్‌ ఫండ్‌కు విరాళాలు అందించవచ్చు.

ఈ చెల్లింపు పద్ధతులు సైతం పీఎం ఇండియా డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.. డెబిట్‌ కార్డులు,  క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ (భీమ్, ఫోన్‌పే, అమెజాన్‌ పే, గూగుల్‌ పే, పేటిఎం, మొబిక్విక్, మొదలైనవి),ఆర్‌.టి.జి.ఎస్‌./ఎన్‌.ఇ.ఎఫ్‌.టి.(నెఫ్ట్‌), ఈ నిధికి అందించే విరాళాలకు సెక్షన్‌ 80(జి) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. 

మరిన్ని వార్తలు