సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు

Published Sun, Mar 29 2020 4:38 AM

Coronavirus: Various Donations for CM Relief Fund - Sakshi

- సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధాన మంత్రి సహాయ నిధికి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి, తెలంగాణ సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చొప్పున రూ.3 లక్షలు అందజేశారు.
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ నాయకుడు పరీక్షిత్‌రాజు సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు ఇచ్చారు. - విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 11 లక్షలు, రాజ్‌దూత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎండీ అద్దేపల్లి రవీంద్రకుమార్‌ రూ.3 లక్షలు అందజేశారు.
- చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 5 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో ఎమ్మెల్యే బి.మధుసూదన్‌రెడ్డి సొంత ఖర్చులతో శనివారం ప్రజలకు లక్ష శానిటైజర్లను పంపిణీ చేపట్టారు. 
- విశాఖపట్నం జిల్లా యలమంచలి మండలం ఉమ్మలాడ వలంటీర్‌ సూరిశెట్టి ప్రసన్నలక్ష్మి భర్త రాము రూ.50 వేల చెక్కును తహసీల్దార్‌ మురళీకృష్ణకు అందజేశారు 
- ప్రముఖ సినీ దర్శకుడు బి.సుకుమార్‌ తన స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. 
- తూర్పు, పశ్చిమ, విశాఖ, కృష్ణా జిల్లాల కోళ్ల రైతుల సంక్షేమ సంఘం రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చింది 

ఆపన్న హస్తాలు 
- గుంటూరుకు చెందిన అమ్మ చారిటబుల్‌ ట్రస్టు గత మూడు రోజులుగా రోజుకు పది వేల మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. 
- భారత రక్షణ రంగ సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన గుండ్రా సతీష్‌రెడ్డి సతీమణి పద్మావతి ఢిల్లీలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు శుక్ర, శనివారాల్లో ఆహార పొట్లాలు అందజేశారు. 
- వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నివాసం ఉంటున్న దాదాపు 200 మంది నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.    

Advertisement
Advertisement