మరాఠా బంద్‌ అసంపూర్ణం

26 Jul, 2018 02:49 IST|Sakshi
నవీ ముంబైలో ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టిన దృశ్యం

ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరు తూ ముంబైలో మరాఠాలు బుధవారం చేపట్టిన బంద్‌ హింసాత్మకంగా మారింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పలు సంస్థలు ముంబై బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మధ్యాహ్నానికే బంద్‌ను విరమిస్తున్నట్లు చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఫడ్నవిస్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు