ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీం

13 May, 2015 11:57 IST|Sakshi
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీం

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో  రాష్ట్రపతి,  ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయ మూర్తుల పోటోలు మాత్రమే ఉండాలని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  వివిధ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై  సుప్రీం కోర్టు బుధవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  దీనికి సంబంధించి త్రి సభ్య కమిటీని వేయాలని  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ఆయా ప్రకటనల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ  నియమించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

 ఇక కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఫోటోలు కూడా వాడరాదని స్పష్టం చేసినట్టయింది. ప్రభుత్వం ప్రకటనల పేరుతో  రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగంతో ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన  ధర్మాససం ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోల వాడకాన్ని నిషేధించింది.

మరిన్ని వార్తలు