సాహస పోలీసు.. కోలుకున్నారు

27 Apr, 2020 17:33 IST|Sakshi
హర్జీత్‌ సింగ్

చండీగఢ్‌: కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడిన సాహస సబ్‌ఇన్‌స్పెక్టర్‌ హర్జీత్‌ సింగ్‌ పూర్తిగా కోలుకున్నారని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. హర్జీత్‌ సింగ్‌ చేయి మునుపటిలా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పటియాలా జిల్లా సనౌర్‌ పట్టణంలో ఏప్రిల్‌ 12న నిహంగ్‌(సిక్కుల్లోని ఓ వర్గం)లు హర్జీత్‌ సింగ్‌ చేతిని కత్తితో నరికారు. ఆయనను వెంటనే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌)కు తరలించగా వైద్య బృందం హర్జీత్‌ సింగ్‌ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించింది. (కరోనా వైరస్‌.. మరో దుర్వార్త

‘రెండు వారాలుగా పీజీఐఎంఈఆర్‌లో చికిత్స పొందుతున్న హర్జీత్‌ సింగ్‌ కోలుకున్నారు. వైద్యులు ఎంతో శ్రమించి ఆయన చేతిని తిరిగి అతికించారు. జీఐఎంఈఆర్‌ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు. హర్జీత్‌ సింగ్‌ ఇప్పుడు చేయిని మళ్లీ కదలించగలుతున్నార’ని సీఎం అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. హర్జీత్‌ సింగ్‌ వీడియోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా, తాజా సమాచారం ప్రకారం పంజాబ్‌లో ఇప్పటివరకు 313  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 71 మంది కోవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. (లాక్‌డౌన్‌ సడలింపా.. అదేం లేదు: సీఎం

మరిన్ని వార్తలు