ఆ సీరియల్‌ మళ్లీ వచ్చేస్తోంది

24 Apr, 2020 13:15 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్  వ‌ల‌న ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీవీ సీరియల్స్‌, సినిమా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలను, పాత టీవి సీరియళ్లను రీటెలికాస్ట్‌ చేస్తూ వీక్షకులను ఆనందింపజేస్తున్నారు. ఇప్పటికే దూరదర్శన్‌ రామాయణం.మహభారతం సీరియల్స్‌ను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకృష్ణ సీరియ‌ల్‌ని తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  
(కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!)

ఈ విషయాన్ని ప్రసారభారతి త‌మ అధికారిక ట్విట్ట‌ర్లో వెల్లడించింది. 90ల‌లో ప్ర‌సార‌మైన పురాణ గాథ శ్రీకృష్ణ‌ని తిరిగి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. రామానంద్ సాగర్ యొక్క 'శ్రీ కృష్ణ' మొదట 1993-1996 మధ్య ప్రసారం చేయబడింది. అప్ప‌ట్లో అత్య‌ధిక రేటింగ్ పొందిన ఈ సీరియ‌ల్ మొట్టమొదట 1993లో దూరదర్శన్‌(డీడీ2లో) ప్రసారమయింది. ఆపై 1996 లో డీడీ నేషనల్‌ మళ్లీ మొదటి నుంచి ప్రసారం చేసింది. ఇప్పటికే అనేక ఛానెల్స్‌లో ప్ర‌సార‌మైన ఈ పాపుల‌ర్ సీరియ‌ల్ తిరిగి ప్ర‌సారం కాబోతుండ‌డంతో అభిమానులు ఆనందిస్తున్నారు. మొత్తం 221 ఎపిసోడ్లుగా ఉన్న శ్రీకృష్ణా సీరియల్‌లో చిన్ని కృష్ణునిగా స్వప్నిల్‌ జోషి నటిస్తే.. పెద్ద కృష్ణునిగా సర్వదమన్‌ బెనర్జీ నటించాడు.

మరిన్ని వార్తలు