తీర్పు తారుమారవుతుందన్న సుబ్రహ్మణ్య స్వామి

21 Dec, 2017 12:18 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు  చేశారు. ఎగువ కోర్టుకు వెళితే తీర్పు తారుమారవుతుందంటూ తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు.ఏ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన  ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన ట్వీట్‌ చేశారు.

రూ 30,000 కోట్ల 2జీ స్కామ్‌ కేసులో 19 మం‍ది నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్ట్‌ నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించిన అనంతరం తీర్పుపై తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలితను కర్నాటక హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించిన అనంతరం సుప్రీం కోర్టులో భిన్నమైన తీర్పు వచ్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా స్వామి ప్రస్తావించారు.

తీర్పు నేపథ్యంలో సంబరాలు చేసుకోవద్దని డీఎంకే నేతలకు ఆయన చురకలంటించారు.కాంగ్రెస్‌, మిత్రపక్షాలకు జయ అక్రమాస్తుల కేసులో ఎదురైన భంగపాటు 2జీ కేసుకూ తప్పదని మరో ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు