తదుపరి టార్గెట్ ఎవరు?

22 Jun, 2016 10:05 IST|Sakshi
తదుపరి టార్గెట్ ఎవరు?

రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ను పంపేసిన తర్వాత.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తదుపరి టార్గెట్ ఎవరో తెలుసా..? ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం. ఆ పదవి నుంచి సుబ్రమణ్యంను తొలగించాలంటూ స్వామి సంచలన ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. ‘‘అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్కు 2013లో చెప్పింది ఎవరు.. అరవింద్ సుబ్రమణ్యం ఎంఓఎఫ్.. ఆయనను వెంటనే తొలగించండి’’ అని స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవింద్ సుబ్రమణ్యమేనని ఆయన అన్నారు. అరవింద్ సుబ్రమణ్యం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

వాస్తవానికి రఘురామ్ రాజన్ తర్వాత అరవింద్ సుబ్రమణ్యమే రిజర్వు బ్యాంకు గవర్నర్ అవుతారన్న కథనాలు వినిపించాయి. కానీ, ఆయన కూడా కాంగ్రెస్ ఏజెంటుగానే వ్యవహరిస్తున్నారన్నది స్వామి వాదన. అందుకే ఆయనను టార్గెట్ చేసి, ముందు ఆర్థిక సలహాదారు పదవి నుంచే పంపేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

 

మరిన్ని వార్తలు