ట్రైమెక్స్ మైనింగ్ కేసుపై సుప్రీం విచారణ

8 Oct, 2018 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఇసుక తవ్వకాల పేరుతో మోనోజైట్ ను వెలికి తీశారని. దాని లీజును రద్దు చేయాలని  మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఏ ఖనిజాలు వెలికితీశారో  తెలుసుకోవడానికి రెండు అధ్యయనాలు జరగాల్సి ఉందని కేంద్ర అణు ఇంధన పరిశోధన సంస్థ కోర్టుకు నివేదించింది.

మైనింగ్ లైసెన్స్ రద్దుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని రెండు వారాల్లో నివేదిక వస్తుందని ఏపీ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్   కోర్టుకు తెలిపారు. కాగా,హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని దీన్ని కూడా అక్కడికే బదిలీ చేయాలని ట్రైమెక్స్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి  సుప్రీం కోర్టును కోరారు. ఇసుక తవ్వకాల పేరుతో11 వేల టన్నుల మోనోజైట్ ఖనిజాన్ని అక్రమంగా వెలికితీశారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్  తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు .

ఈ మైనింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రికవర్ చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. అక్రమాలకు పాల్పడిన  ట్రైమెక్స్ మైనింగ్ లైసెన్స్  రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు. కేంద్ర అణు పరిశోధన సంస్థ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపడతామని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం  కేసు విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు