‘కంచె’ పట్టు చీరలు 

17 Feb, 2018 13:43 IST|Sakshi
దోమకొండలో పంట చేను చుట్టూ కట్టిన చీరలు  

అడవి పందుల బెడదకు రైతన్న ఉపాయం

దోమకొండ: ప్రతియేటా రైతులు పండించిన పంటలు ఎదో కారణంగా దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టి రైతులను దెబ్బతీస్తుంది. ఈ సారి రబీలోనైనా పంటలను పండించుకుందామనుకున్న రైతులకు అడవి పందుల బెడదతో కష్టాలు ఎదురవుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి చీరలను కొనుగోలు చేసి వాటిని పంట చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేసి కాపాడుకుంటున్నారు. పంట పొలాలు ఊరికి దూరంగా ఉడటం వలన రాత్రిల్లు అడవి పందులు దాడులు చేస్తున్నాయి.

వీటి నుండి కాపాడుకోవడానికి గతంలో కరెంట్‌ తీగలను ఏర్పాటు చేసేవారు. కాని వీటి వలన మనషుల ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. దోమకొండకు చెందిన రైతు నెతుల మల్లేషం తన వ్యవసాయ బావి వద్ద 6 ఎకరాలు మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఇంటిలోని పాత పట్టు చీరలను పంట చుట్టూ వేసాడు, దీనికి తోడు కామారెడ్డి నుండి రూ.20కి ఒక చీర చొప్పున వంద చీరలను కోనుగోలు చేసి పంట చుట్టూ కట్టినట్లు సాక్షితో తెలిపారు.

మరిన్ని వార్తలు