ప్రొఫెసర్ సుర్జీత్ హన్స్కు యూకేలో సత్కారం

22 Jul, 2013 16:43 IST|Sakshi

ప్రముఖ ఆంగ్ల రచయిత విలియం షేక్ స్పియర్ నాటకాలను పంజాబీలోకి అనువదించిన భారతీయ ప్రొఫెసర్ సుర్జీత్ హన్స్ (82)ను ఈలింగ్ మేయర్ కమల్జిత్ ఎస్ దిండ్సా ఘనంగా సత్కరించారు. ఆదివారం సాయంత్రం ఈలింగ్ మేయర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హన్స్ను ఆయన గౌరవించారు.

 

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత నాటకాలను ఇలా పంజాబీ భాషలో అనువదించి పంజాబీ భావితరాలకు హన్స్ అందిస్తున్న అమూల్యమైన కానుక ఆని కమల్జిత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే హన్స్పై ఈలింగ్ కౌన్సిల్లో లేబర్ పార్టీకి చెందిన ఉపనాయకుడు రంజిత్ ధీర్ ప్రశంసల జల్లు కురిపించారు. షేక్స్పియర్ యొక్క 38 నాటకాలను హన్స్ పంజాబీలోకి అనువదించారని తెలిపారు.

 

ఈ సందర్బంగా హన్స్ ప్రసంగిస్తూ... చార్లెస్ డార్విన్ రచించిన 'ద ఆరిజన్ ఆఫ్ స్పైసెస్' ను ప్రస్తుతం పంజాబీ భాషలోకి అనువదిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్లోని స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ, ఒంకార్ సహోట, లండన్ అసెంబ్లీలోని ఈలింగ్, హిలింగ్డన్ సభ్యులతోపాటు పలువురు ఎన్నారై ప్రములకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృత్సర్లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ సుర్జీత్ హన్స్ చరిత్ర బోధించేవారు.

మరిన్ని వార్తలు