హైదరాబాద్‌కు బయల్దేరిన 146 తెలుగువారు

18 Jun, 2020 10:51 IST|Sakshi

సింగపూర్‌ : లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్ చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు ప్రవాసులను అక్క‌డి తెలుగు స‌మాజం స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు స‌మాజం సౌజ‌న్యంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బ‌య‌ల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారు ఉండ‌గా... ఇద్ద‌రు త‌మిళ‌నాడుకు చెందిన వారు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది.

ఈ విమానం ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి అన్నారు. సకాలంలో అనుమతులు ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విమానం ఏర్పాటుకు స‌హ‌క‌రించిన‌ క‌పిల్ ఏరో సీఈఓ చిన్న‌బాబు, తెలంగాణ అండ్‌ ఏపీ ఏవియేష‌న్ ఎండీ భ‌ర‌త్ రెడ్డికి సింగ‌పూర్ తెలుగు స‌మాజం తరపును జనరల్‌ సెక్రటరీ సత్యా చిర్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే ఈ విమానంలో ఉన్న‌ 62 మంది ఏపీ వాసుల‌ను హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వెళ్ల‌డంలో సాయం చేస్తున్న ఏపీఎన్ ఆర్‌టీ చైర్మన్ మేడపాటి వెంకట్‌కు తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియ‌జేశారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు