అమరావతి కారాదు సంక్షోభ నగరి!!

3 May, 2015 03:45 IST|Sakshi
అమరావతి కారాదు సంక్షోభ నగరి!!

రాశిలోగాక వాసిలో, స్థాయిలో గాక సారంలో గొప్ప నగరాన్ని నిర్మించడం అత్యుత్తమం. గృహ వసతి, రవాణా సదుపాయాల అవస రాల కంటే సరఫరా ముందుండేటట్టు చేయగలిగితే అది సాధ్యమే. తద్విరుద్ధంగా అవసరాలను అనుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సంక్షోభం. అందుకు తావే లేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు వదులుకోరాదు.

మన దేశం ఏమంత ఎక్కువగా కొత్త నగరాలను నిర్మించింది లేదు. స్వాతంత్య్రోదయ కాలంలో నిర్మిం చిన చండీగఢ్ రూపకర్త ఫ్రెంచివా డైన లి కొర్బూజె కాగా, జర్మన్ వాస్తు శిల్పి ఆటొ కొనిగ్స్ బెర్‌గర్ భువనేశ్వ ర్‌కు రూపకల్పన చేశారు. ఆపై నిర్మించిన గాంధీనగర్‌పై కోర్బూసి యర్ ప్రభావం ఉంది. ఆ అర్థంలో నవీ ముంైబె , రాయ్‌పూర్‌లు మాత్రమే బహుశా పూర్తి స్వదేశీ నమూనాలుగా లెక్క. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సింగపూర్ నమూనాలతో నిర్మాణం కానుంది. సింగపూర్ ఒక నగర రాజ్యమే తప్ప వలసలతో పట్టణీకరణ దిశగా సాగుతూ అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్ర రాజధాని కాదు. ప్రత్యేకించి ఆ అంశం కారణంగా మనకున్న పరిమిత అనుభవం నేపథ్యం నుంచే అమరావతి ఎలా ఉం డాలో ఊహించుకోవాల్సి ఉంది. మన దేశంలోని ఇతర నగ రాలన్నీ దశాబ్దాలు, శతాబ్దాల తరబడి పరిణామం చెంది నవే. ప్రామాణిక భారత నగరంగా చూపగలిగేదేదీ లేదు. అమరావతి ‘స్మార్ట్’ నగరం కావాల్సిందే. కాకపోతే ఎంత సూక్ష్మబుద్ధితో అందుకు ప్రణాళికను రూపొందిస్తాం, అమ లుచేస్తాం అనే దానిపైనే  అది ఆధారపడి ఉంటుంది. నూతన నగరం శాసనసభ, సచివాలయం, తత్సంబంధిత వివిధ భవనాల సముదాయం ప్రధాన భాగంగా ఉండే ఒక రాష్ట్ర రాజధాని. ప్రత్యేకించి ఆ కారణంగా నిర్మాణానికి ముందే కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి.

 అమరావతి భవనాల ముందరి భాగాలు ధగధగలాడే గాజుతో కూడినవి కాకూడదు. అలాంటి భవనాలు లోపలి భాగాలను సౌఖ్యవంతం చేయడం కోసం ఖరీదైన, కొరతగా ఉన్న విద్యుత్తును తెగ కబళించేస్తాయి. ఇక రవాణా కార్లపై ఆధారపడినది కాకూడదు. గృహ వసతి, రవాణా వ్యవస్థలే ఒక నగరం నాణ్యత, సమర్థతలకు కొలబద్ధలు. చండీగఢ్ నగర ప్రణాళిక వృద్ధి చెందుతున్న సేవలనందించే వర్గానికి, అల్పాదాయ వర్గాలకు చౌకగా గృహవసతి ఏర్పాట్లను విస్మ రించి తప్పు చేసింది. నగరం చుట్టూ మురికివాడల వలయా న్ని సృష్టించుకుంది. అక్కడ నివసించేవారు ఎంతో వ్యయప్ర యాసలతో, నానా బాధలూ పడి పని కోసం నగరంలోకి వెళ్లి రావాలి. ప్రధానంగా ఉద్యోగుల గృహవసతి సహా ప్రభుత్వ అవసరాల కోసమే తయారైన గాంధీనగర్ కూడా వలసవచ్చే పేద గ్రామీణ ప్రజలను విస్మరించింది. ముంబై నగర విస్తీ ర్ణానికి సమానంగా ఉండే నవీ ముంబై ఆవిర్భావం సుదీ ర్ఘంగా సాగింది. పేరుకు ప్రపంచంలోనే అతి పెద్ద నగరమైనా నేటికీ అది నత్తనడక నడుస్తోంది. అందులో మూడోవంతు భాగం మాత్రమే మునిసిపాలిటీల కిందికి వచ్చింది. మరో మూడో వంతు మురికివాడలే. గ్రామా లను మురికివాడలుగా మారేంతవ రకు నిర్లక్ష్యం చేశారు. వాటిలో సదు పాయాలు శూన్యం, జనసమ్మర్థం ముమ్మరం.

 త్వరలో వివరాలను వెల్లడించ నున్న అమరావతి  భారీ ఎత్తున గృహ వసతి కల్పనకు హామీనిచ్చే బాధ్య తను స్వీకరించాలి. నివాసానికి సిద్ధం గా ఉన్న గృహాలు కనీసం లక్షయినా ఉంటేనే తక్షణమే అది జనావాస నగరంగా మారుతుంది. కొద్దికొద్దిగా పెంచుకుం టూపోయే పద్ధ్దతి ధరలు పెరగడానికి మాత్రమే దారితీస్తుం ది. అలాగాక ప్రభుత్వం మాత్రమే అక్కడుండేట్టయితే... సాయంత్రానికి అది భూత నగరిగా మారుతుంది. రోడ్ల మీద కార్లను నివారించడం, చౌకగా సమర్థవంతమైన రవాణాను సాధ్యం చేయడం అనే రెండు కారణాల రీత్యా ముందు నుం చే ప్రజార వాణా వ్యవస్థను ఎంచుకోవాలి. స్మార్ట్ సిటీ అంటే ఐటీ రంగ ఉద్యోగులకు పార్కింగ్ స్థలాల లభ్యతే కానవస రంలేదు. నగర ప్రజలకు ఎంత చౌకగా గృహవసతిని, రవా ణాను అందిస్తామనేది గీటురాయి కావాలి. హాంకాంగ్ వాసులకు కారు అవసరం లేదు.  మెరుగైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల ఫ్రాన్స్‌లోని లీయోన్ నగరంలో కార్ల వాడకం 20 శాతం పడిపోయింది. మ్యూనిచ్ కార్ల అవసరమే ఉండన ట్టుగా గృహసముదాయాల ప్రణాళికలను రచిస్తోంది. ప్రభు త్వ రవాణా వ్యవస్థ ఔచిత్యాన్ని లండన్ సైతం గుర్తించింది. హెల్సింకి కార్ల కంటే సైకిళ్లకు ఎక్కువ స్థలాన్ని కేటాయి స్తోంది. ఈ జాబితా చాలానే ఉంది.


 ప్రపంచం ఎక్కువ జనసమ్మర్థత, ఎత్తై భవనాలు, తక్కువ కార్లపై ఆధారపడే నమూనా దిశగా పయనిస్తోంది. అదే నేటి పట్టణ ప్రణాళికా వివేకంగా పెంపొందుతోంది. కానీ మనం మాత్రం కార్ల వాడకం ఇంకా ఇంకా పెరగాల్సిం దే, రోడ్లు మరింతగా కిక్కిరిసిపోవాల్సిందేనన్న భావనలోనే చిక్కుకుపోయాం. ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మన్నన కొరవ డింది. నగర జీవితాలను భయంకరమైన రోజువారీ ఒత్తిడిమ యంగా మార్చుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు విజ్ఞ తతో రాసిలోగాక వాసిలో, స్థాయిలోగాక సారంలో గొప్ప నగరాన్ని రూపొందించడం అత్యుత్తమం. గృహవసతి, రవా ణా సదుపాయాల అవసరాల కంటే సరఫరా ముందుం డేట్టుగా చేయగలిగితే అది సాధ్యమే. కానీ అవసరాలననుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సం క్షోభం. అందుకు తావేలేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకా శం బాబు ముందుంది. దాన్ని ఆయన వదులుకోకూడదు.
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్

 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

మరిన్ని వార్తలు