ప్రజాప్రతినిధులు మాఫియాగా మారి లూటీ..

31 May, 2018 18:12 IST|Sakshi
కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ

సాక్షి, నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలపై శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బీజేపీకి కొమ్ము కాస్తాయన్నారు. అంతేకాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటాయని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలను నమ్మోద్దు.. నాలుగేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫమయిందని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షభంలో ఉందని ఆయన తెలిపారు. సీఎం చంద్రశేఖర్‌ రావు చేపట్టిన భదాద్రి, యాదాద్రిలో ఒక్క యూనిట్‌ ఉత్పత్తి కాలేదన్నారు. కొత్తగా ఒక్క మెగావాట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మాఫియాగాగా మారి లూటీ చేస్తున్నారు. వ్యవసాయం పేరు మీద ఇస్తున్న కౌలు రైతులకు కూడా ఇవ్వాలిని ఆయన అన్నారు. 48 నెలలు గడిచినా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ గురించి ఎంపీ కవిత ఊసేత్తడం లేదని షబ్బీర్‌ అలీ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు