బెంగాల్‌లో ఎలా తనిఖీ చేస్తాయి?: మమత

11 May, 2020 17:08 IST|Sakshi

కోల్‌కతా : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌-19 కట్టడికి కృషి చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ‌ విమర్శించారు. కరోనాను ఎదుర్కొవడానికి రాష్ట్రంలో తమవంతు కృషి తాము చేస్తున్నామని, ఇలాంటి సమయంలో కూడా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆమె సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై సీఎం మమతా అసహనం వ్యక్తం చేశారు.
(చదవండి : మూడు విడతలుగా లాక్‌డౌన్‌ ఎత్తివేత)

కరోనాను అడ్డం పెట్టుకుని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, కరోనాపై సాగిస్తున్న పోరులో అందరికి కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే లేదని, ఇష్టమున్నట్లు చేస్తున్నారని కేంద్రంపై మమతా బెనర్జీ  మండిపడ్డారు. కేంద్ర బృందాలు వచ్చి బెంగాల్‌లో ఎలా తనిఖీలు చేస్తాయని ప్రశ్నించారు. రోజు రోజుకు నిబంధనలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వాని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించి అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగాలని సీఎం మమత వ్యాఖ్యానించారు.  (చదవండి : కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్‌!)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు