బాబుకు అధికారం..ప్రజల ప్రాణాలు గాల్లో

7 Aug, 2018 14:57 IST|Sakshi
సీపీఐ ఏపీ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ(పాత చిత్రం)

విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు జిల్లా క్వారీ ఘటనాస్థలానికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు..కానీ ఒక్కరి పై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా క్వారీ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.

రాష్ర్ట మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర సమస్యలపై మేధావులు, ప్రజా సంఘాలతో ఆగస్టు 10న చర్చిస్తామని, రాయలసీమ సమస్యలపై ఆగస్టు 26న చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.  నాలుగు సంవత్సరాలు బీజేపీ కలిసి కాపురం చేసిన టీడీపీ ఇప్పుడు పార్లమెంటు వేదికగా చేస్తున్న డ్రామాలు, వేషాలు ఆపాలని సూచించారు. రూ.53 వేల కోట్ల పీడీ అకౌంట్ల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు