కరోనా వేళ మంత్రులకు కొత్త కార్లు

5 Jul, 2020 02:22 IST|Sakshi

ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. అధికారిక వాహనం కొనుగోలు చేసుకోవడానికి విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఇందుకోసం రూ.22.83 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తప్పుపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులకు కొత్త వాహనాలు సమకూర్చడం ఏమిటని మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాయిదా వేస్తూ.. మంత్రుల కోసం ప్రజాధనం ఫలహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు