రాష్ట్రంలో నియంత పాలన 

21 Mar, 2018 16:26 IST|Sakshi
మాట్లాడుతున్న గుండా మల్లేశ్‌

     సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్‌ 

     ఆసిఫాబాద్‌లో పార్టీ జిల్లా         ద్వితీయ మహాసభలు

ఆసిఫాబాద్‌క్రైం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతపాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్‌ అన్నా రు. జిల్లాకేంద్రంలోని స్థానిక రోజ్‌ గార్డెన్‌లో మంగళవారం పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని, ఈ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీలను విస్మరిస్తూ మాటల గారడీతో ప్రజలను మో సం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని ఆరోపించారు.

జిల్లాలో పార్టి బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి పద్మ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కార్యదర్శులు బద్రి సత్యనారాయణ, కళవేణి శంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.తిరుపతి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్, నాయకులు గణేశ్, దివాకర్, పంచపల, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు