వైఎస్సార్‌సీపీలో చేరిన కారెం శివాజీ

29 Nov, 2019 17:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం ఆయన పార్టీలో చేరారు. కారెం శివాజీకి సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన.. శివాజీ గురువారమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశాను. పదవీ కాలం ఉన్నా సీఎం జగన్ ఆశయాలకు ఆకర్షితుడిని రాజీనామా చేశాను. బేషరతుగా వైస్సార్‌సీపీలో చేరుతున్నాను. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయి. 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి కళ్ళలో కాంతి కనిపిస్తోంది. నవరత్నాలు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ ఆంద్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మేలు చేశారు. ఆంగ్ల మాధ్యమం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం.. లేదంటే మా పిల్లలు వెనుకబడతారు. అందుకే మేము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నాం.  మేమంతా సీఎం జగన్‌కు అండగా ఉంటాం.’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా