‘మంత్రివర్గ భేటీలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఊసే లేదు’

29 Jan, 2019 22:14 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ప్రకటించడం పచ్చి అబద్ధమని అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రివర్గం నిర్ణయాలకు సంబంధించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు విడుదల చేసిన ప్రతులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని పేర్కొన్నారు. అందులో ఎక్కడా కూడా అగ్రిగోల్డ్‌ ఊసే లేదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలలోనే ముగ్గురు అగ్రిగోల్డ్‌ బాధితులు గుండెలాగి మరణించినా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 263 మంది బాధితులను పొట్టనబెట్టుకున్నా ప్రభుత్వం దాహం తీరలేదా అని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు