అయిదేళ్ల పాలనపై చర్చకు రావాలని పిలుపు

6 Mar, 2020 18:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయనమండిపడ్డారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గురుంచి ఇన్నాళ్లు మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల  సమయంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరిపాలని చూస్తుంటే, స్టేల కోసం టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. (‘బీసీల పట్ల ప్రేమ అంటూనే కోర్టుకు వెళ్తారా..’)

అధికారంలో ఉండగా చంద్రబాబు బీసీలకు చేసిందేమి లేదని, గడిచిన ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కనుచూపు మేరలో కూడా కనిపించదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే లోకేష్ ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయారని తండ్రి కొడుకు కడుపు మంటతో  ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు 90 శాతం అమలు చేశామని తెలిపారు. (టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స)

‘‘బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చిదాం. మీరు సిద్దమేనా...? గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మతాల ప్రస్తావనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్‌ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మాది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. విద్య, వైద్య రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చూస్తున్నారు. బోండా ఉమా నిరాశలో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. విడతల వారిగా మద్యం నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే మీ అయిదు సంవత్సరాల పాలనపై, మా తొమ్మిది నెలల పాలపై చర్చకు సిద్దమా...?’’ అంటూ చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు