కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దు: కేసీఆర్‌

22 Nov, 2023 14:51 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : కాంగ్రెస్‌ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంట‌ల క‌రెంటే ఇస్తున్నారని సీఎం కేసీఆర్‌.. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మ‌న గ‌తి కూడా అంతే అవుతుందని హెచ్చ‌రించారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, పైల‌ట్ రోహిత్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. ధాన్యం కొనుగోలు కోసం 7500 కేంద్రాలు ఏ‍ర్పాటు చేశామన్నారు. రైతులకు 2 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. రూ.200 ఉన్న పింఛను రూ. 2వేలు చేశామని,  రైతుల బాగోగుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

‘ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. కాంగ్రెస్‌ భూమాతను ప్రవదిశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుంది. ఒకప్పుడు ప్ర‌భుత్వం చేతిలో రైతుల బ‌తుకు ఉండే. ఇప్పుడు మీ బొట‌న‌వేలు పెడితేనే భూ య‌జ‌మాన్యం మారుత‌ది. ముఖ్య‌మంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్ర‌భుత్వం మీకు ధార‌పోసిన ఆ అధికారాన్ని పొడ‌గొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణ‌యించుకోవాలి.
చదవండి: TSRTC: ఉద్యోగుల జీతాలు కట్‌.. ఈసీని కలిసిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ

కరవు, వలసలతో గత కాంగ్రెస్‌ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. క‌త్తి ఒక‌రికి ఇచ్చియుద్ధం ఇంకొక‌రిని చేయ‌మంటే ధ‌ర్మం కాదు క‌దా..? రైతుల ప‌క్షాన‌, ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండే వారి చేతిలో క‌త్తి పెడితేనే వాళ్లు మిమ్మ‌ల్ని కాపాడుతారు. 24 గంట‌ల క‌రెంట్ ఉంట‌ది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే క‌రెంట్ ఆగ‌మైపోత‌ది. కాబ‌ట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి.

బీజేపీ నాయకులు నాయకులు వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. వారిని పైలట్ రోహిత్‌రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ నిర్మించాంజ’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు