‘బాబు! ఏపీ గడ్డమీదకొచ్చి మాట్లాడు’

28 Apr, 2020 19:11 IST|Sakshi
తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు

చంద్రబాబుపై మండిపడ్డ తణుకు ఎమ్మెల్యే కారుమూరి

సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్‌ గడ్డమీద కొచ్చి మాట్లాడాలని, ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలను కరోనా వైరస్‌ టైంలో చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రశ్నించారు. మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్ అనేది రేపో మాపో  పోయేది  కాదు. ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన పోలియో ఈ రోజుకూ మనతో లేదా..?. ఇప్పటికీ సంవత్సరానికి రెండు సార్లు పోలియో డ్రాప్స్ ఎందుకు వేస్తున్నాం. ఒక పోలియో మాదిరిగానే  ఈ కరోనా కూడా మనతో ఉంటుందనే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. కరోనాకి వ్యాక్సిన్  వచ్చే వరకు మనం దానితో సావాసం చేయాల్సిందే. ( మంత్రి అసంతృప్తి.. గవర్నర్‌పై ఫిర్యాదు)

దానిపై కూడా పక్క రాష్ట్రంలో అద్దాల మేడలో కూర్చుని బాబు విమర్శలు చేస్తున్నారు. నిన్న తెలంగాణలో  150 టెస్టులు  చేస్తే మనం 7 వేల పైచిలుకు టెస్టులు చేశాం. ఎక్కువ టెస్టులు చేయటంతో ఎక్కువ కేసులు బైట పడ్డాయ్. ఆ మాత్రం విషయం కూడా గమనించకపోవటం బాబు డొల్లతనాన్ని తెలుపుతోంద’’ని మండిపడ్డారు. ( యాక్సిస్ బ్యాంకునకు కరోనా షాక్ )

మరిన్ని వార్తలు