కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

28 Jul, 2019 20:30 IST|Sakshi
జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యే విశ్వనాథ్‌

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని  మరో రెబల్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌ గౌడ ఓ వీడియో విడుదల చేశారు. 

(చదవండి : కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం)

కాగా స్పీకర్‌ తాజా నిర్ణయంతో  వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్‌ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

కమల ప్రక్షాళన

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?