చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ హవా!

11 Dec, 2018 09:27 IST|Sakshi

రాయ్‌పూర్‌:  చత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు.. పోటీపడ్డాయి. అధికార పార్టీ బీజేపీతో హోరాహోరిగా తలపడ్డ కాంగ్రెస్‌.. ఒకేసారి 23 స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  తాజా సమాచారం ప్రకారం బీజేపీ 21, కాంగ్రెస్‌ 55, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 90 నియోజకవర్గాలున్న చత్తీస్‌గడ్‌లో  కాంగ్రెస్‌ 65 స్థానాల వరకు గెల్చుకునే అవకాశముందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

మరిన్ని వార్తలు