‘చంద్రబాబుపై కోర్టు ధిక్కారం కేసు పెట్టాలి’

31 Dec, 2018 11:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ముందు ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్కేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు కేంద్రంలో మోదీతో అంటకాగింది వ్యభిచారమా, కాపురమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంకాగానే తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.

హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని విజయసాయి డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్ కోసమే హైకోర్టును విభజించారని  చెప్పడంతో చంద్రబాబుకు మంతిభ్రమించిందని అనడానికి నిదర్శనమన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీకి కేసీఆర్‌ లేఖ రాస్తానని అనటం తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌తో పాటు హోదాకు ఎవ్వరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని అన్నారు.

తలాక్‌ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలి..
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభలో డిమాండ్‌ చేసింది. బిల్లులోని పలు అంశాలను సెలెక్టు కమిటీ పరిశీలన చేయాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.


 

మరిన్ని వార్తలు